ఏ దేశం నుంచైనా ఆయుధాలు కొనే అధికారం మాకుంది: అమెరికాకు భారత్ కౌంటర్

01-10-2019 Tue 11:50 | National
  • రష్యా నుంచి ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థను కొనుగోలు చేస్తున్న భారత్
  • అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్న అమెరికా
  • ఆయుధాల కొనుగోళ్లు మా సార్వభౌమాధికారమన్న భారత్
రష్యా నుంచి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్-400ను భారత్ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డీల్ పై అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పటికే అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. 2017 చట్టం ప్రకారం రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తుంటుంది. అయినప్పటికీ అమెరికా హెచ్చరికలను భారత్ ఖాతరు చేయకుండా డీల్ వ్యవహారంలో ముందుకు సాగుతోంది.
 
ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, అమెరికాకు కౌంటర్ వేశారు. ఏ దేశం నుంచి ఏది కొనుగోలు చేయాలో, ఏది చేయకూడదో చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్-400ను కొనుగోలు చేసే అధికారం భారత్ కు ఉందని చెప్పారు. ఆయుధాల కొనుగోళ్లు అనేవి పూర్తిగా భారత్ సార్వభౌమాధికారమని అన్నారు.

ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. మూడు రోజుల పర్యటనకు గాను జైశంకర్ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియోతో భేటీ కావడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, అమెరికా అభ్యంతరాలపై భేటీలో చర్చిస్తామని తెలిపారు.
IndiaUSARussiaS 400Jaishankar

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more