గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల 30న అపాయింట్ మెంట్ ఆర్డర్లు

28-09-2019 Sat 16:08 | Andhra
  • సీఎం జగన్ చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు
  • అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు ప్రారంభం
  • మున్ముందు మరిన్ని సేవలు అందిస్తామన్న సర్కారు
వైసీపీ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల సాయంతో పరిపాలన నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఉద్యోగుల కోసం నియామక ప్రక్రియ కూడా పూర్తయింది. కొన్నిరోజుల క్రితమే పరీక్ష ఫలితాలు వెల్లడి కావడం, మెరిట్ లిస్టు విడుదల చేయడం జరిగింది. దీనిపై మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడారు. ఈ నెల 30న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తున్నట్టు వెల్లడించారు. సీఎం జగన్ చేతులమీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నట్టు తెలిపారు.

గ్రామ, వార్డు సచివాలయాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, ఇకపై ప్రజాపాలన స్థానిక సచివాలయాల ద్వారానే అందిస్తామని చెప్పారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాల్లో పౌరసేవలు ప్రారంభమవుతాయని, 72 గంటల్లో పూర్తయ్యేలా 10 సేవలను అందుబాటులోకి తెస్తున్నామని, ఆ తర్వాత సేవలను మరింత పెంచుకుంటూ పోతామని విజయ్ కుమార్ వివరించారు.

పట్టణాల్లో ప్లాన్, బిల్డింగ్ అనుమతులు మూడ్రోజుల్లోనే ఇస్తామని, డెత్, బర్త్ సర్టిఫికెట్ నమూనాలను వెంటనే ఇచ్చేస్తామని తెలిపారు. వార్డు సచివాలయాల్లో ప్రతిరోజూ స్పందన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. అమ్మ ఒడి, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతు భరోసా, పెన్షన్లు వంటి పథకాలను గ్రామ సచివాలయాల ద్వారానే అమలు చేస్తామని అన్నారు.
Andhra PradeshJaganYSRCP

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more