చిరంజీవి రాజకీయ సలహాపై కమలహాసన్ స్పందన!
- రాజకీయాల్లోకి వెళ్లి టైమ్ వేస్ట్ చేసుకోవద్దన్న చిరంజీవి
- గెలుపు, ఓటముల కోసం రాజకీయాల్లోకి రాలేదన్న కమల్
- ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు వచ్చానంటూ వ్యాఖ్య
ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యల పట్ల కమల్ స్పందించారు. గెలుపు, ఓటముల కోసం తాను రాజకీయాల్లోకి రాలేదని కమల్ అన్నారు. మార్పు కోసం, ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయరంగంలోకి ప్రవేశించానని చెప్పారు. చిరంజీవి గతంలో తనకెప్పుడూ సలహాలు ఇవ్వలేదని అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడంతో ప్రజల ఆలోచన ధోరణిపై అవగాహన పెరిగిందని చెప్పారు.