తన రిటైర్మెంట్ వెనకున్న అసలు కారణాన్ని బయటపెట్టిన యువరాజ్ సింగ్
- నన్ను తొలగించేందుకు సాకులు వెతికారు
- యోయో టెస్టును పాసయ్యే సరికి తట్టుకోలేకపోయారు
- మరిన్ని అవకాశాలు ఇచ్చి ఉంటే కొనసాగి ఉండేవాడిని
36 ఏళ్ల వయసులో యోయో టెస్టు పాస్ అవుతానని ఊహించని మేనేజ్మెంట్.. పాసయ్యేసరికి సాకులు వెతికిందని, దేశవాళీ క్రికెట్ ఆడాలన్న నెపంతో తనపై వేటేసిందని తీవ్ర ఆరోపణలు చేశారు. 16 ఏళ్లపాటు జట్టుకు ఆడిన తనను జట్టు నుంచి ఎందుకు తొలగిస్తున్నదీ కూర్చోబెట్టి చెప్పొచ్చని, కానీ అలా చేయలేదన్నాడు. సెహ్వాగ్, జహీర్ఖాన్ల విషయంలోనూ ఇదే జరిగిందని యువరాజ్ పేర్కొన్నాడు.