మనసు మార్చుకున్న బీజేపీ... హుజూర్‌నగర్‌లో బీసీ అభ్యర్థితో రంగంలోకి?

27-09-2019 Fri 10:39 | Telangana
  • అభ్యర్థిని మార్చనున్నట్లు ప్రచారం
  • ఇప్పటికే కళా రెడ్డికి టికెట్టు ఇస్తారని వార్తలు
  • తాజాగా కోట రామారావుపై దృష్టిపెట్టినట్లు సమాచారం
తెలంగాణలోని హుజూర్‌నగర్‌ అసెంబ్లీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికలో బీజేపీ తన వ్యూహాన్ని మారుస్తున్నట్టు కనిపిస్తోంది. తెలంగాణలో బలపడ్డామని, వచ్చే ఎన్నికల నాటికి సత్తాచాటుతామని చెప్పుకుంటున్న కమలదళం నేతలు హుజూర్‌నగర్‌ ఎన్నిక ద్వారా  ట్రైల్ వేయాలని ఉవ్విళ్లూరుతున్నారు.

గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎంపీగా గెలవడంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. దీంతో ఈ స్థానాన్ని చేజిక్కించుకునేందుకు సిట్టింగ్‌ కాంగ్రెస్‌తోపాటు అధికార టీఆర్‌ఎస్‌, బీజేపీలు గట్టిగా ప్రయత్నిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపిక నుంచి ఆచితూచి అడుగులు వేస్తున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ఉత్తమ కుమార్‌ భార్యకు టికెట్టు కేటాయించగా, టీఆర్‌ఎస్‌ కూడా అభ్యర్థిని ప్రకటించింది. రెండు పార్టీల అభ్యర్థులు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో తాము కూడా అదే సామాజిక వర్గం అభ్యర్థిని బరిలోకి దించాలని బీజేపీ యోచిస్తూ కళారెడ్డి పేరును తెరపైకి తెచ్చింది.

తాజా పరిణామాలతో బీజేపీ తన వ్యూహం మార్చి బీసీ అభ్యర్థికి సీటు కేటాయించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఇందుకోసం డాక్టర్‌ కోట రామారావు పేరు పరిశీలిస్తోందని, ఈరోజు సాయంత్రంలోగా ఆయన పేరును బీజేపీ అధిష్ఠానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
huzurnagarBJPBC candidage

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more