Narendra Modi: తుపాకి గురిపెట్టి విడాకుల పత్రాలపై సంతకాలు పెట్టమంటున్నాడు.. మోదీకి లేఖ రాసిన యూపీ మంత్రి భార్య

  • సంతకం పెట్టకుంటే కాల్చేస్తానని బెదిరిస్తున్నాడు
  • పోలీసులు కూడా ఆయనతో కుమ్మక్కయ్యారు
  • కోర్టులోనే తేల్చుకుంటా
ప్రధాని నరేంద్రమోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు యూపీ మంత్రి బాబురాం నిషాద్ భార్య నీతూ నిషాద్ రాసిన లేఖలు సంచలనమయ్యాయి. విడాకుల దరఖాస్తుపై సంతకం చేయాలని భర్త తనపై ఒత్తిడి తీసుకొస్తున్నాడని, పెట్టకుంటే చంపేస్తానని తుపాకి గురిపెట్టి బెదిరించాడని ఆరోపించారు. మంత్రిగా ఉన్న తన భర్త ఇలా భార్యకు తుపాకి గురిపెట్టి కాల్చేస్తానని బెదిరించడం ఎంత వరకు కరెక్టని ప్రశ్నించారు.

భర్త పెట్టే బాధలు భరించలేక గతంలో పలుమార్లు పోలీసులను ఆశ్రయించానని, అయితే, మంత్రి బెదిరింపులతో పోలీసులు కూడా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. పోలీసులు తన భర్తతో కుమ్మక్కయ్యారని తీవ్ర ఆరోపణలు చేశారు. భర్త నిషాద్ తనపై పలుమార్లు దాడి చేశాడని, ఈ విషయాన్ని తాను కోర్టులోనే తేల్చుకుంటానని లేఖలో పేర్కొన్నారు. కాగా, భర్త వేధింపులపై నీతూ ఫేస్‌బుక్‌లోనూ పలు పోస్టులు చేశారు. మంత్రి భార్య లేఖలు యూపీ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నాయి.  
Narendra Modi
yogi adityanth
baburam nishad
letter

More Telugu News