తన బంధువుల కుర్రాడి కోసం వేణుమాధవ్ రికమెండ్ చేశారు.. అదే ఆయన చివరి కోరిక అయింది: హైపర్ ఆది
- వేణుమాధవ్ మృతితో శోకసంద్రంలో టాలీవుడ్
- తీవ్ర విచారం వ్యక్తం చేసిన హైపర్ ఆది
- స్కిట్ నచ్చితే ఫోన్ చేసి మెచ్చుకునేవాడని వెల్లడి
ఇటీవలే వేణుమాధవ్ తనకు ఫోన్ చేసి బంధువుల కుర్రాడికి జబర్దస్త్ లో చాన్స్ ఇవ్వాలని కోరాడని, ఆయన చెప్పినట్టే ఆ కుర్రాడికి ఓ స్కిట్ లో అవకాశం ఇచ్చామని ఆది వివరించాడు. అదే వేణుమాధవ్ తనను కోరిన చివరి కోరిక అయిందని చెబుతూ హైపర్ ఆది భావోద్వేగాలకు గురయ్యాడు. జబర్దస్త్ కార్యక్రమం ఏదైనా స్కిట్ తనకు నచ్చితే వెంటనే ఫోన్ చేసి మెచ్చుకునేవాడని వేణుమాధవ్ మనస్తత్వం గురించి చెప్పాడు.