ఇది చంద్రబాబు దిగజారుడు తనానికి నిదర్శనం: ఆమంచి కృష్ణమోహన్

26-09-2019 Thu 15:34 | Andhra
  • నాగార్జునరెడ్డిపై దాడి ఘటనపై డీజీపీకి లేఖ రాస్తారా!
  • సోషల్ మీడియా వేదికగా నాపై ఆరోపణలు తగదు
  • చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లిపోయారు
చీరాల విలేకరి నాగార్జునరెడ్డిపై దాడి కేసులో తనపై టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఖండించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, నాగార్జునరెడ్డిపై దాడి ఘటన గురించి డీజీపీకి చంద్రబాబు లేఖ రాయడం, బాబు దిగజారుడు తనానికి నిదర్శనం అని అన్నారు.

తన గురించి, తన కుటుంబం గురించి సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రాన్ని దోచుకుని వెళ్లిపోయారని, గత ఐదేళ్లు నీచమైన పరిపాలన చేశారని చంద్రబాబుపై దుమ్మెత్తిపోశారు. గత ప్రభుత్వ హయాంలోని అవినీతి బయటపడుతుందనే చంద్రబాబు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.

చంద్రబాబు వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారు

నాడు వంగవీటి రంగా హత్య కేసులో ఒక్కరికి కూడా శిక్ష పడకుండా చంద్రబాబు కాపాడారని, కర్నూలు జిల్లాలో నారాయణరెడ్డిని దారుణంగా హత్య చేయించారని, ఇలాంటి దారుణాలు చేయించిన చంద్రబాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారని అన్నారు. చంద్రబాబు వల్లే కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కోడెల అంతిమయాత్రలో పాల్గొన్న చంద్రబాబు విక్టరీ సింబల్ ఎందుకు చూపించారని ప్రశ్నించారు. చనిపోయిన వ్యక్తితో కూడా రాజకీయం చేయాలని బాబు యత్నించారని అన్నారు.

నాడు ఆంధ్రప్రభ రిపోర్టర్ హత్య కేసులో మాజీ మంత్రి పుల్లారావుపై చర్యలు ఎందుకు తీసుకోలేదని బాబును ప్రశ్నించారు. వైఎస్ జగన్ నీతి, నిజాయతీ ముందు చంద్రబాబు సరిపోరని, ప్రతి విషయాన్ని సీఎం జగన్ కు ఆపాదించడం మంచిది కాదని, అక్రమంగా ఉంటున్న చంద్రబాబు ఇంటిని ఎప్పుడు కూలుస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారని వ్యాఖ్యానించారు.
ChandrababuTelugudesamAmanchiYSRCP

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more