ఏడాదిన్నర క్రితం ట్రిపుల్ తలాక్.. ఇటీవల ఆమెపై అత్యాచారం.. ఓ ప్రొఫెసర్ నిర్వాకమిది!
- అలీగఢ్ లోని యూనివర్సిటీలో ప్రొఫెసర్
- వేరుగా ఉంటున్న భార్య
- పిల్లల్ని చూసే నెపంతో వెళ్లి అత్యాచారం
దీంతో విధిలేని పరిస్థితుల్లో ఆమె తన ఇద్దరు పిల్లలను తీసుకుని వేరుగా ఉంటోంది. విడాకుల అనంతరం పిల్లలను చూసే నెపంతో ఆమె ఇంటికి నిందితుడు తరచూ వస్తుండేవాడు. గత నెల 29వ తేదీన కూడా అలాగే వచ్చాడు. ఆ సమయానికి ఇంట్లో మాజీ భార్య ఒక్కతే ఉండడంతో ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు లైంగిక దాడి (సెక్షన్ 376), క్రిమినల్ బెదిరింపులు (సెక్షన్ 506) కింద కేసు నమోదు చేశారు.