మణిరత్నం మూవీలో ఐశ్వర్యరాయ్ ద్విపాత్రాభినయం
- భారీ చారిత్రక చిత్రంగా 'పొన్నియన్ సెల్వన్'
- చోళరాజుల పాలన నేపథ్యంలో సాగే కథ
- కీలకమైన పాత్రలో మోహన్ బాబు
ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ కీలకమైన పాత్రను పోషించనున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇక ఆమె ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనుందనేది తాజా సమాచారం. చోళరాజ వంశానికి చెందిన మందాకినీ దేవి, ఆమె కూతురు నందినిగా రెండు పాత్రల్లో ఐశ్వర్యరాయ్ కనిపించనుందని అంటున్నారు. విక్రమ్ .. కార్తీ .. పార్తీబన్ .. మోహన్ బాబు .. విజయ్ సేతుపతి .. జయం రవి .. కీర్తి సురేశ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారితో కలిసి మణిరత్నం ఈ సినిమాను నిర్మిస్తున్నారు.