యాదాద్రిలో ‘హరే రామ హరే కృష్ణ’ ఆశ్రమం నేలమట్టం.. భారీ భద్రత మధ్య కూల్చేసిన అధికారులు
- యాదాద్రి చుట్టూ ఆరు లేన్ల రీజనల్ రింగు రోడ్డు నిర్మాణం
- అడ్డంగా ఉన్న హరే రామ హరే కృష్ణ ఆశ్రమం
- నోటీసులు ఇచ్చినా స్పందించని ఆశ్రమ నిర్వాహకులు
ఆశ్రమ కూల్చివేతను అడ్డుకునేందుకు బీజేపీ, ఆరెస్సెస్ తదితర హిందూ ధార్మిక సంస్థలు వస్తాయని భావించిన పోలీసులు ముందస్తుగా ఆ ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అనంతరం దానిని కూల్చివేశారు. కూల్చివేత సమయంలో లభించిన కృష్ణుడి చెక్క విగ్రహాలు, ఇతర సామగ్రిని యాదాద్రి దేవస్థానానికి తరలించినట్టు ఆర్డీవో పేర్కొన్నారు.