బౌద్ధ సన్యాసితో తాయెత్తులు కట్టించుకుని పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు
- పాక్ లో శ్రీలంక జట్టు పర్యటన
- భద్రతా కారణాలతో సీనియర్లు దూరం
- ద్వితీయశ్రేణి జట్టుతో సరిపెట్టిన లంక బోర్డు!
ఈ నేపథ్యంలో, తాజా పర్యటనకు పలువురు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు పాక్ పయనమైంది ద్వితీయ శ్రేణి జట్టే! తమ ఆటగాళ్ల రక్షణకు పాక్ ఎంత భరోసా ఇచ్చినా లంక క్రికెట్ బోర్డు తాను చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. ఓ బౌద్ధ సన్యాసితో ఆటగాళ్లకు రక్ష తాయెత్తులు కట్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.