బౌద్ధ సన్యాసితో తాయెత్తులు కట్టించుకుని పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు

  • పాక్ లో శ్రీలంక జట్టు పర్యటన
  • భద్రతా కారణాలతో సీనియర్లు దూరం
  • ద్వితీయశ్రేణి జట్టుతో సరిపెట్టిన లంక బోర్డు!
విదేశీ క్రికెట్ జట్లు పాకిస్థాన్ లో  పర్యటించాలంటే హడలిపోయే పరిస్థితుల్లో శ్రీలంక జట్టు సాహసం చేస్తోంది. తాజాగా మూడు వన్డేలు, మూడు టి20 మ్యాచ్ లు ఆడేందుకు లంకేయులు పాక్ పయనమయ్యారు. గతంలో శ్రీలంక జట్టుపైనే పాక్ లో ఉగ్రదాడి జరిగింది. బస్సులో వెళుతున్న లంక జట్టుపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. బస్సు డ్రైవర్ తెగువతో లంక క్రికెటర్లకు పెను ప్రమాదం తప్పింది. అయినప్పటికీ పలువురు ఆటగాళ్లు కాల్పుల్లో గాయపడ్డారు.

ఈ నేపథ్యంలో, తాజా పర్యటనకు పలువురు స్టార్ ఆటగాళ్లు దూరమయ్యారు. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు పాక్ పయనమైంది ద్వితీయ శ్రేణి జట్టే! తమ ఆటగాళ్ల రక్షణకు పాక్ ఎంత భరోసా ఇచ్చినా లంక క్రికెట్ బోర్డు తాను చేయాల్సిన ప్రయత్నాలు చేసింది. ఓ బౌద్ధ సన్యాసితో ఆటగాళ్లకు రక్ష తాయెత్తులు కట్టించింది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
Go Back to Shorts
Pakistan
Sri Lanka
Cricket

More Telugu News