మామిడిపండ్లు దొంగిలించాడని భారత కార్మికుడికి దేశ బహిష్కరణ
- దుబాయ్ లో ఘటన
- ఆకలి వేయడంతో రెండు పండ్లు దొంగిలించానన్న యువకుడు
- అది తప్పేనంటూ శిక్ష విధించిన యూఏఈ న్యాయస్థానం
ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆ యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ సందర్భంగా తన తప్పును అంగీకరించిన ఆ యువకుడు దొంగతనం ఎందుకు చేయాల్సి వచ్చిందో వివరించాడు. బాగా ఆకలి వేస్తుండడంతో పాటు దాహంగా ఉండడంతో మామిడిపండ్లను తీసుకున్నానని వెల్లడించాడు. అయితే తప్పు తప్పేనంటూ యూఏఈ న్యాయస్థానం దేశ బహిష్కరణ శిక్ష విధించింది. దాంతోపాటే నగదు జరిమానా కూడా వడ్డించింది.