అప్పుతీర్చమన్నందుకు.. తండ్రిని చంపేసిన కొడుకు!

23-09-2019 Mon 10:03 | Andhra
  • భోజనం చేస్తుండగా వచ్చి దారుణం
  • సాయపడిన నిందితుడి మామ, బావమరిది
  • మిస్టరీ ఛేదించిన తాడిపత్రి పోలీసులు
అప్పు రూపంలో ఇల్లు పోతుందన్న కక్షతో కన్నతండ్రినే హత్యచేశాడో ప్రబుద్ధుడు. భోజనం చేస్తున్న తండ్రిపై మామ, బావమరిది సాయంతో  దాడిచేసి గొంతుకోసి మరీ కిరాతకంగా చంపేశాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణం కాల్వగడ్డ వీధిలో జరిగిన ఈ ఘాతుకం మిస్టరీని పోలీసులు ఛేదించారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ వీధికి చెందిన విశ్రాంత హెడ్‌కానిస్టేబుల్‌ లక్ష్మన్న (66)ను రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారు. అగ్నిమాపక శాఖలో పనిచేసిన లక్ష్మన్న, దస్తగిరమ్మ దంపతులు. వీరికి హరికుమార్‌, హరికృష్ణ అని ఇద్దరు కొడుకులు. పెద్దకొడుకు అనంతపురంలోని ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటున్నాడు. చిన్నకొడుకు పెళ్లి చేసుకుని కడప జిల్లా పులివెందులలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు.

పుట్టపర్తిలో పనిచేస్తుండగా ఎనిమిదేళ్ల క్రితం లక్ష్మన్న పదవీ విరమణ చేశాడు. దస్తగిరమ్మ భర్తతో విభేదాల కారణంగా 15 ఏళ్ల క్రితమే విడిచి వెళ్లిపోయింది. దీంతో లక్ష్మన్న మరో మహిళతో సహజీవనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో లక్ష్మన్న హత్య జరగడంతో హంతకులెవరన్నది మిస్టరీగా మారింది. అయితే, ఆస్తి విషయమై గొడవలు జరుగుతుండడంతో కొడుకులే ఇందుకు కారణమై ఉంటారన్న ఉద్దేశంతో ఆ దిశగా పోలీసులు కూపీలాగడంతో మిస్టరీ విడిపోయింది.

లక్ష్మన్న చిన్నకొడుకు హరికృష్ణే ఈ హత్యకు పాల్పడ్డాడని తేల్చారు. లక్ష్మన్న పదవీ విరమణ చేసినప్పుడు వచ్చిన మొత్తాన్ని కొడుకులు ఇద్దరికీ సమానంగా పంచాడు. హరికృష్ణ ఇల్లు కట్టుకుంటానని చెప్పి అన్న హరికుమార్‌కు వాటాగా వచ్చిన మొత్తం నుంచి ఐదు లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఇన్నేళ్లవుతున్నా అప్పు తీర్చక పోవడంతో పెద్ద కొడుకు తరపున లక్ష్మన్న కోర్టును ఆశ్రయించాడు. కోర్టు తీర్పు  లక్ష్మన్నకు అనుకూలంగా వచ్చే పరిస్థితి ఉండడంతో తండ్రి అడ్డు తొలగించుకోవాని హరికృష్ణ నిర్ణయించాడు.

ఇందుకు తనకు పిల్లనిచ్చిన మామ బోడోళ్ల తిరుపాల్‌, భార్య సోదరుడు కుళ్లాయప్పతో కలిసి లక్ష్మన్న ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో తండ్రి భోజనం చేస్తుండగా చంపేశాడు. మామ, బావమరిది తండ్రి కాళ్లు, చేతులు పట్టుకోగా హరికృష్ణ చాకుతో తండ్రి గొంతుకోసి హత్యచేశాడు. అనంతరం తలుపు వేసి పరారయ్యారు. పెద్దకొడుకు హరికుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసు తమదైన శైలిలో విచారించడంతో వాస్తవం బయటపడింది. దీంతో నిందితులు ముగ్గురినీ పోలీసులు అరెస్టు చేశారు.
Crime Newsmurder misteryson murdered fatherAnantapur District

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more