గృహ నిర్బంధంలో ఉన్న కశ్మీర్ నేతలకు హాలీవుడ్ సినిమాలు చూపిస్తున్నారట!
- 18 నెలలకు మించి వారిని నిర్బంధించబోం
- వారున్నది నిర్బంధంలో కాదు.. అతిథులుగా
- కేంద్రమంత్రి జితేంద్రసింగ్
జమ్ముూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసి, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో రాష్ట్రంలో ఎటువంటి అలజడులు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యగా మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా, మెహబూబాముఫ్తీ, ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా వంటి వారిని గృహ నిర్బంధంలోకి తీసుకుంది. వీరంతా ఇంకా నిర్బంధంలోనే ఉన్నారు. వీరి నిర్బంధం విషయమై తాజాగా కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.