బీసీ వర్గం మహిళకు ఫస్ట్ ర్యాంక్ వస్తే విమర్శిస్తావా?: చంద్రబాబుపై జోగి రమేశ్ ఫైర్

  • చంద్రబాబుూ! ‘నీకు ఎందుకయ్యా ఏడుపు?
  • అదే నీ వర్గానికి ఫస్ట్ ర్యాంక్ వస్తే, చంకలు కొట్టుకుంటావా?
  • ఓ పత్రికలో కథనం వచ్చిందని సీఎం కు లేఖ రాస్తావా?
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ నిప్పులు చెరిగారు. గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఆరోపణలను ఖండించారు. ఈ సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, గ్రామ సచివాలయ ఉద్యోగాల్లో బీసీ వర్గానికి చెందిన మహిళకు ఫస్ట్ ర్యాంక్ వచ్చినందుకు తాము ఆనందిస్తుంటే.. ‘నీకు ఎందుకయ్యా ఏడుపు? అదే నీ వర్గానికి వస్తే, చంకలు కొట్టుకుని దండలేస్తావే! అదే, మా వర్గాలకు వస్తే హర్షించడం పోయి రాళ్లు వేయడం, కారుకూతలు కూయడం’ చేస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఓ పత్రికలో కథనం వచ్చిందని చెబుతూ చంద్రబాబు లేఖ రాశారని విమర్శించారు. ఇలాంటి కథనాన్ని ఆధారంగా చేసుకుని జగన్ కు లేఖ రాస్తావా? ‘ఖబడ్దార్, చంద్రబాబునాయుడు’ అంటూ మండిపడ్డారు.
Go Back to Shorts
YSRCP
mla
Jogi ramesh
Telugudesam
Babu

More Telugu News