హౌడీ హ్యూస్టన్... పలకరించిన నరేంద్ర మోదీ!

  • ట్విట్టర్ లో స్పందించిన మోదీ
  • నగరం ప్రశాంతంగా ఉందని వ్యాఖ్య
  • హ్యూస్టన్ ను ఎనర్జిటిక్ సిటీగా అభివర్ణన
అమెరికాలోని హ్యూస్టన్ నగరం హౌడీ మోదీ... హౌడీ మోదీ అని ప్రతిధ్వనిస్తుంటే, మోదీ మాత్రం హౌడీ హ్యూస్టన్ అంటున్నారు. మరికాసేపట్లో నగరంలో దాదాపు 50 వేల మందిని ఉద్దేశించి, మోదీ ప్రసంగించనున్నారు.

ఈ సందర్భంగా తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "హౌడీ హ్యూస్టన్. ఈ మధ్యాహ్నం చాలా ప్రశాంతంగా ఉంది. ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ నగరంలో నేను ఇవాళ, రేపు ఉంటాను. ఇది డైనమిక్, ఎనర్జిటిక్ సిటీ" అని అభివర్ణించారు. 'హౌడీ మోదీ' కార్యక్రమంలో దాదాపు 400 మంది కళాకారులు పాల్గొని సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు.
Go Back to Shorts
Houston
Narendra Modi
Howdy Modi

More Telugu News