తిరుమల తిరుపతా?.. తెలంగాణ తిరుపతా?: మండిపడుతున్న రాయలసీమ పోరాట సమితి!
- జంబో పాలకమండలిని ప్రకటించిన ఏపీ ప్రభుత్వం
- బోర్డును రద్దు చేయాలన్న నవీన్ కుమార్ రెడ్డి
- నిరసనలు వ్యక్తం చేస్తున్న బీజేపీ
భక్తులు పరమ పవిత్రంగా భావించే తిరుమలపై కళంకితులకు చోటు కల్పించారని ఆయన ఓ ప్రకటనలో ఆరోపించారు. ఈ బోర్డు వద్దే వద్దని అన్నారు. కాగా, బీజేపీ సైతం బోర్డుపై నిరసన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఏపీకి చెందిన దేవాలయంలో రాష్ట్రానికి చెందిన సభ్యులతో పోలిస్తే, ఇతర ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.