మధ్యతరగతి జీవులకూ ఊరట.. రాయితీల యోచనలో కేంద్రం
- త్వరలోనే కేంద్రం నుంచి మరో ప్రకటన
- కార్పొరేట్ సంస్థలకు పన్ను మినహాయింపు నేపథ్యంలో విమర్శలు
- వీలైనంత త్వరగా అమలు చేసే యోచనలో కేంద్రం
మధ్యతరగతికి రాయితీలు కల్పించే విషయంలో గతంలో ఆర్థిక శాఖ నియమించిన ఓ టాస్క్‌ఫోర్స్ ఇందుకు సంబంధించిన నివేదికను గత నెలలోనే మంత్రి నిర్మలా సీతారామన్‌కు సమర్పించినట్టు సమాచారం. కార్పొరేట్‌కు పన్ను తగ్గింపు ప్రకటన తర్వాత సామాన్యుల సంగతేంటన్న విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. వీలైనంత త్వరలోనే మధ్యతరగతికి ఊరటనిచ్చే ప్రకటన వెలువడవచ్చని దీనితో సంబంధం ఉన్న సన్నిహిత వర్గాలు తెలిపాయి.