రోడ్డుపై రూ. 8 లక్షల బ్యాగు.. చలించని మనుసు.. పోలీసులకు అప్పగింత
- ప్రకాశం జిల్లాలోని పర్చూరులో ఘటన
- సాయిబాబా ఆలయం వద్ద దొరికిన బ్యాగు
- అప్పగించిన యువకుడిని అభినందించిన పోలీసులు
నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి దానిని పోలీసులకు అప్పగించాడు. అందులోని మొత్తం చూసిన పోలీసులు షాకయ్యారు. అందులో మొత్తం రూ.8 లక్షలు ఉంది. అంత మొత్తాన్ని చూసినప్పటికీ చలించకుండా పోలీసులకు అప్పగించి నిజాయతీని చాటుకున్న యువకుడిని పోలీసులు అభినందించారు. బ్యాగు పోగొట్టుకున్నవారు తగిన ఆధారాలతో వస్తే అప్పగిస్తామని ఈ సందర్భంగా పోలీసులు తెలిపారు.