నటుడిగా, రాజకీయ నేతగా శివప్రసాద్ తనదైన పంథాలో ముందుకు వెళ్లారు: పవన్ కల్యాణ్ నివాళులు

  • అనారోగ్యంతో మరణించిన మాజీ ఎంపీ శివప్రసాద్
  • శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్
  • ప్రత్యేకహోదా కోసం పోరాడారంటూ కితాబు
చిత్తూరు జిల్లా సీనియర్ రాజకీయ నాయకుడు టీడీపీ మాజీ ఎంపీ శివప్రసాద్ మృతి పట్ల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. శివప్రసాద్ ఏపీకి ప్రత్యేక హోదా కోసం తనదైన శైలిలో స్పందించారని కితాబిచ్చారు. నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన పంథాయే వేరని తెలిపారు. మంత్రిగానూ, ఎంపీగానూ ఎన్నో సేవలు అందించారని పేర్కొన్నారు. జనసైనికుల తరఫున శివప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు వివరించారు.
Go Back to Shorts
Pawan Kalyan
Sivaprasad
Telugudesam
Jana Sena

More Telugu News