మరో కేసు విషయంలో.. ఏలూరు పోలీస్ స్టేషన్ కు చింతమనేని ప్రభాకర్ తరలింపు

  • ఏలూరు జిల్లా జైల్లో ఉన్న చింతమనేని
  • మరో కేసు విచారణ కోసం స్టేషన్ కు తరలించిన పోలీసులు
  • విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రస్తుతం ఏలూరు జిల్లా కారాగారంలో ఉన్న సంగతి తెలిసిందే. ఓ అట్రాసిటీ కేసుకు సంబంధించి ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇదే సమయంలో, మరో కేసుకు సంబంధించి జైలు నుంచి చింతమనేనిని ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా ఆయనను పోలీసులు విచారించనున్నట్టు సమాచారం. విచారణ అనంతరం ఆయనను కోర్టులో ప్రవేశ పెట్టనున్నట్టు తెలుస్తోంది. చింతమనేనిపై అనేక కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Go Back to Shorts
Chinthamaneni Prabhakar
Telugudesam
Case

More Telugu News