కశ్మీర్ పై మోర్టార్ షెల్స్ ప్రయోగించిన పాకిస్థాన్.. చాకచక్యంగా ధ్వంసం చేసిన భారత్.. వీడియో!
- జమ్మూకశ్మీర్ లోని పూంఛ్ లో ఘటన
- 9 మోర్టార్ షెల్స్ ను గుర్తించిన ఆర్మీ
- షెల్స్ పేలుడుకు కంపించిన ప్రాంతం
పూంఛ్ సెక్టార్ లోని సన్డోటే, బసోనీ, బాలాకోటే గ్రామాల పరిధిలో 9 మోర్టార్ షెల్స్( 120 ఎంఎం) స్వాధీనం చేసుకుంది. అనంతరం మెంధార్ ప్రాంతంలో ఓ గుంత తవ్విన భారత ఆర్మీ.. అందులో ఈ మోర్టార్ షెల్స్ ను నిర్వీర్యం చేసింది. ఈ సందర్భంగా మోర్టార్ షెల్స్ పేలడంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా కంపించింది. ఈ వీడియోను మీరూ చూసేయండి