సుజనా చౌదరి భూములపై ఏపీ ప్రభుత్వ రహస్య విచారణ
- గత వారం రోజులుగా కంచికచర్ల మండలంలో పర్యటిస్తున్న అధికారులు
- అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత భూక్రయవిక్రయాలపై ఆరా
- ఆరా నిజమేనన్న కంచికచర్ల తహసీల్దార్
కృష్ణా జిల్లా కంచికచర్ల మండల పరిధిలో సుజనాకు భూములు ఉన్నాయని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించిన నేపథ్యంలో ఈ వివరాలు సేకరిస్తున్నారు. కాగా, రాజధాని ప్రాంతంలోని వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్న అధికారులు రాజధాని ప్రకటన తర్వాత ఆయా ప్రాంతాల్లో ఎవరి నుంచి ఎవరు ఎంతెంత విస్తీర్ణంలో భూములు కొన్నారు? అన్న వివరాలను కూపీ లాగుతున్నారు. అధికారులు వివరాలు సేకరించడం నిజమేనని కంచికచర్ల తహసీల్దార్ రాజకుమారి తెలిపారు.