300 అడుగుల లోతులో ఉన్న బోటును బయటకు తీయడం కష్టం: మంత్రి పినిపే విశ్వరూప్

తూర్పు గోదావరి జిల్లాలో ఇటీవల జరిగిన బోటు ప్రమాద ఘటనకు సంబంధించిన తాజా వివరాలను మంత్రి పినిపే విశ్వరూప్ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా 13 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని, చివరి వ్యక్తి ఆచూకీ తెలిసే వరకూ గాలింపు చర్యలు కొనసాగిస్తామని అన్నారు.

అయితే, మూడు వందల అడుగుల లోతులో ఉన్న బోటును బయటకు తీయడం కష్టమని అభిప్రాయపడ్డారు. ముంబై నుంచి ఓ టీమ్ ఇక్కడికి వచ్చిందని, యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని మళ్లీ మూడురోజుల్లో వస్తామని చెప్పిందని అన్నారు. ప్రతికూల పరిస్థితుల్లో కూడా జిల్లా యంత్రాంగం ఇక్కడే ఉందని చెప్పారు. లభ్యమైన మృతదేహాలను వారి బంధువులకు అప్పగిస్తామని, వారి స్వగ్రామాలకు తరలిస్తామని చెప్పారు.  

ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులను మంత్రి అవంతి శ్రీనివాస్ ఈరోజు పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా  సహాయసహకారాలు అందిస్తామని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా కల్పించారు.
Go Back to Shorts
East Godavari
Boat
Accident
Minister
Pinepi

More Telugu News