ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సహృదయత.. సొంత వాహనంలో ఆసుపత్రికి క్షతగాత్రుల తరలింపు!
- కృష్ణా జిల్లా ఆత్కూరులో ప్రమాదం
- ఆటోను బలంగా ఢీకొన్న కారు
- ఇద్దరికి తీవ్రగాయాలు.. సాయం చేసిన మంత్రి నాని
అప్పుడే అటుగా సచివాలయానికి వెళుతున్న మంత్రి ఆళ్ల నాని ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపారు. బాధితులను గుర్తించి వెంటనే తన వాహనంలో దగ్గర్లోని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి తరలించారు. ఈ సందర్భంగా బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి డాక్టర్లను ఆదేశించారు. కాగా, మంత్రి స్పందనకు అన్నివర్గాల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు కారు డ్రైవర్ ను అరెస్ట్ చేశారు.