రాష్ట్రంలో మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలేనంటున్న ఆర్టీజీఎస్
- ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా వర్షాలు
- రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచన
- రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరిక
అదే సమయంలో తూర్పు గోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని పేర్కొన్నారు. రాయలసీమలో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశముందని ఆర్టీజీఎస్ తాజా బులెటిన్ లో హెచ్చరించింది. భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతాయని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.