Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కలెక్టర్ గారూ, నాకు పీవీ సింధుతో పెళ్లి చేయండి... నా వయసు పదహారే!: 70 ఏళ్ల వృద్ధుడి వింత కోరిక

  • తమిళనాడులో వింత ఉదంతం
  • ప్రజాదర్బార్ లో లేఖతో ప్రత్యక్షమైన వృద్ధుడు
  • పీవీ సింధు తనకు తగిన జోడీ అంటున్న మలైసామి
తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ వృద్ధుడు తనకు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధుతో పెళ్లి చేయాలని సాక్షాత్తు జిల్లా కలెక్టర్ నే సాయం కోరాడు. జిల్లా కలెక్టర్ వీరరాఘవరావు ప్రజాదర్బార్ నిర్వహిస్తుండగా, 70 ఏళ్ల మలైసామి అనే వృద్ధుడు కూడా వినతిపత్రంతో హాజరయ్యాడు. ఏదో సాయం కోసం వచ్చాడులే అని అందరూ భావించినా, ఆ లేఖలో ఏముందో తెలిసిన తర్వాత ముక్కుమీద వేలేసుకున్నారు.

తాను 2004లో జన్మించానని, తాను దేవుడి ప్రత్యేక అవతారాన్నని, దుష్టశిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరించానని అందులో పేర్కొన్నాడు. తనలాంటి కారణజన్ములు సాధారణ యువతులను పెళ్లి చేసుకోరాదని, అందుకే పీవీ సింధు వంటి పేరుప్రతిష్ఠలున్న అమ్మాయిని పెళ్లిచేసుకోవాలని భావిస్తున్నానని తన లేఖలో వివరించాడు. పీవీ సింధును పెళ్లి చేసుకునేందుకు కలెక్టర్ గారు సహకారం అందించాలని, కుదరకపోతే కిడ్నాప్ చేసైనా ఆమెను పెళ్లాడతానని మలైసామి పేర్కొన్నాడు. ఆ లేఖలో తన ఫొటో పక్కనే పీవీ సింధు ఫొటో కూడా అంటించాడు.

ఈ వినతిపత్రం చూసిన కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. మలైసామి లేఖపై కలెక్టర్ కార్యాలయం ఎలాంటి చర్యలు తీసుకుందో తెలియదు కానీ, ఈ విషయం మాత్రం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సందడి చేస్తోంది.
PV Sindhu
Tamilnadu
Malaisamy

More Telugu News