జల దిగ్బంధంలో మహానంది... దర్శనాలు రద్దు!
- నిన్న రాత్రి నుంచి భారీ వర్షం
- నీట మునిగిన పంచ లింగాలు
- నంద్యాలతో రాకపోకలు కట్
ఆలయంలో మొదటి, రెండో ప్రాకారంలోకి ప్రవేశించిన వరద నీరు, ఆపై పంచలింగాల మంటపాన్నీ ముంచెత్తగా, ఆలయ అధికారులు దర్శనాలు రద్దు చేశారు. రుద్రగుండం కోనేరులో వరద ఉద్ధృతికి పంచలింగాలూ మునిగిపోయాయి. మరోవైపు పాలేరు వాగు ఉద్ధృతితో నంద్యాల - మహానంది మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీరు తగ్గే వరకూ భక్తులు ఆలయానికి రావద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.