ప్రేమికులకు వేర్వేరు పెళ్లిళ్లు.. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న ప్రేమజంట
- చిత్తూరు జిల్లాలో ఘటన
- నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతీయువకులు
- కర్ణాటకలో శవాలై కనిపించిన వైనం
ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదన్న మనస్తాపంతో ఉన్న వీరిద్దరూ గత నెలలో కుటుంబ సభ్యులతో గొడవపడి ఇల్లొదిలి వెళ్లిపోయారు. వీరి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం కర్ణాటకలోని కోలారు జిల్లా బేతమంగళం చెరువు సమీపంలో వీరిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.