రేణూ దేశాయ్ కు ‘డెంగీ’ వ్యాధి.. సోషల్ మీడియాలో ప్రకటించిన నటి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రేణూ దేశాయ్ కు ‘డెంగీ’ వ్యాధి.. సోషల్ మీడియాలో ప్రకటించిన నటి!

  • ప్రస్తుతం కోలుకుంటున్న రేణూ
  • ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచన
  • త్వరలోనే ఓ సినిమాకు దర్శకత్వం
ప్రముఖ హీరోయిన్, దర్శక-నిర్మాత రేణూ దేశాయ్ సంచలన విషయం బయటపెట్టారు. ప్రస్తుతం తాను డెంగీ వ్యాధి బారిన పడి కోలుకుంటున్నానని తెలిపారు. డెంగీ వ్యాధి నుంచి కోలుకుంటున్నప్పటికీ తాను ఓ షూటింగ్ లో పాల్గొనాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ విషయమై ఇన్ స్టాగ్రామ్ లో రేణూ దేశాయ్ స్పందిస్తూ..‘ఈటీవీలో ప్రసారం కాబోయే ఢీ ఛాంపియన్ షో 12వ సీజన్ కోసం షూటింగ్ జరిగింది. కొన్నిగంటల పాటు జరిగిన షూటింగ్ కు నేను కాదని చెప్పలేకపోయా. దోమల నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు పొడవైన దుస్తులనే ధరించండి’ అని సూచించారు. ఈ సందర్భంగా డెంగీ వ్యాధితో షూటింగ్ లో పాల్గొన్న సమయంలో దిగిన ఓ ఫొటోను రేణూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రేణూ దేశాయ్ త్వరలోనే రైతుల కథాంశంతో ఓ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు సమాచారం.
Renu desai
DENGI
DISEASE
Bollywood
Tollywood
Social Media

More Telugu News