మహారాష్ట్రలో భీకర ఎన్ కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల హతం!

  • మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఘటన
  • నిఘా సమాచారంతో బలగాల కూంబింగ్
  • ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం
మహారాష్ట్రలో మావోయిస్టుల ప్రాబల్యమున్న గడ్చిరోలి జిల్లాలో ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మావోయిస్టులను భద్రతాబలగాలు కాల్చిచంపాయి. ఘటనాస్థలి నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయమై పోలీస్ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ.. గడ్చిరోలి జిల్లాలోని గ్యారపట్టి అటవీప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్లు తమకు నిఘా సమాచారం అందిందని తెలిపారు.

దీంతో తాము భారీఎత్తున కూంబింగ్ ప్రారంభించామని చెప్పారు. అయితే తమ రాకను పసిగట్టిన మావోయిస్టులు కాల్పులు జరుపుతూ పరారయ్యేందుకు యత్నించారన్నారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాబలగాలు ఎదురుకాల్పులు జరిపాయని పేర్కొన్నారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఘటనాస్థలిలో ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు నిషేధిత సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Go Back to Shorts
Maharashtra
Encounter
Maoists
2 DEAD
Police
Security forces

More Telugu News