తెలంగాణను ముంచే పోలవరం వద్దని వ్యతిరేకించాం: కేసీఆర్

  • పోలవరం వద్దని ఆనాడే చెప్పామన్న కేసీఆర్
  • కాంగ్రెస్ తెలంగాణకు అన్యాయం చేసిందంటూ విమర్శలు
  • అసెంబ్లీలో మాటల యుద్ధం
తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను ముంచే పోలవరం ప్రాజెక్టు వద్దని ఆనాడు వ్యతిరేకించామని తెలిపారు. ఇందిరా సాగర్ పేరుతో పోలవరం ప్రాజెక్టును ప్రతిపాదించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు అన్యాయం చేసిందని ఆరోపించారు. ఈ విషయం రికార్డుల్లో ఉందని, కావాలంటే చూసుకోవాలని విపక్షాలకు సూచించారు. కాగా, ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో కేసీఆర్, కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధం సాగింది. దివాలా తీసిన ప్రభుత్వం తీరులో బడ్జెట్ ఉందని భట్టి విమర్శించగా, ఓవైపు ప్రాజెక్టులు పూర్తవుతున్నా చూడలేని కళ్లు ఉన్న కబోదుల్లా తయారయ్యారంటూ కేసీఆర్ విపక్ష నేతపై మండిపడ్డారు.
Go Back to Shorts
KCR
Telangana
TRS
Congress
Mallu Bhatti Vikramarka

More Telugu News