నావి గోడమీది పిల్లి వాటం రాజకీయాలు కావు: బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌

  • పార్టీ మారాలనుకుంటే చెప్పే వెళ్తా
  • ఊహాగానాలపై స్పష్టత ఇచ్చిన టీఆర్ ఎస్ నాయకుడు
  • మా ఇంటి పక్కనే ఎంపీ అరవింద్‌ ఇల్లుండడంతో కలిశాను
నేను గోడమీద పిల్లిలా రాజకీయాలు చేయనని, ఒకవేళ పార్టీ మారాలనుకుంటే అందరికీ చెప్పి ధైర్యంగా వెళ్లిపోతానని టీఆర్‌ఎస్‌ తరపున బోధన్‌ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యే షకీల్‌ స్పష్టం చేశారు. ఈ నెల 17న తాను బీజేపీలో చేరనున్నట్లు వస్తున్న వార్తలపై ఈరోజు అసెంబ్లీ లాబీల్లో మాట్లాడారు.

ఓ ముస్లిం ఎమ్మెల్యేనైన తాను బీజేపీలో చేరుతానని మీరు ఎలా ఊహిస్తున్నారని మీడియాను ఎదురు ప్రశ్నించారు. తనపై కేసులు ఉన్న విషయాన్ని కూడా ఆయన ఖండించారు. గతంలో రెండు కేసులు ఉండేవని, వాటి నుంచి నిర్దోషిగా బయటపడ్డానని గుర్తు చేశారు. ఇప్పుడు కేసుల సమస్య ఏదీ లేదన్నారు. ఇక, ఎంపీ అరవింద్‌ ఇల్లు మా ఇంటి పక్కనే ఉండడంతో ఆయనను మర్యాదపూర్వకంగానే కలిశాను తప్ప మరో ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
Go Back to Shorts
TRS
bodhan MLA
shakil

More Telugu News