వాల్మీకి వివాదం: హీరో వరుణ్ తేజ్ కు నోటీసులు

  • వాల్మీకి టైటిల్ మార్చాలంటున్న బోయ హక్కుల పోరాట సమితి  
  • హైకోర్టులో పిటిషన్
  • విచారణ చేపట్టిన న్యాయస్థానం
హరీశ్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన వాల్మీకి చిత్రం టైటిల్ వివాదాస్పదం కావడం తెలిసిందే. వాల్మీకి టైటిల్ మార్చాల్సిందేని బోయ హక్కుల పోరాట సమితి పోరాటం కొనసాగిస్తోంది. దీనిపై వారు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయగా, తాజాగా ఆ పిటిషన్ పై విచారణ చేపట్టారు.

ఈ నేపథ్యంలో, హైకోర్టు వాల్మీకి హీరో వరుణ్ తేజ్ తో పాటు, చిత్ర యూనిట్ కు, రాష్ట్ర డీజీపీకి, సెన్సార్ బోర్డుకు, ఫిలించాంబర్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ మరో నెలరోజుల తర్వాత ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వాల్మీకి చిత్రం ట్రైలర్ కు విశేష స్పందన వచ్చింది. ఈ సినిమా సెప్టెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Valmiki
Varun Tej
Tollywood
Andhra Pradesh
Telangana
High Court

More Telugu News