Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శకుని మామా, మధ్యలో ఆగిన మీ 'జైలుయాత్ర' సినిమా త్వరలోనే పూర్తి కాబోతోంది, రెడీగా ఉండండి: బుద్ధా వెంకన్న వ్యంగ్యాస్త్రాలు

  • విజయసాయిరెడ్డి లక్ష్యంగా బుద్ధా వ్యాఖ్యలు
  • మహామేత సినిమా అట్టర్ ఫ్లాప్ అంటూ వ్యంగ్యం
  • తుగ్లక్ 100 రోజుల పాలన ప్లాన్ చేయాలంటూ సలహా
టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న వైసీపీపైనా, ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డిపైనా విమర్శనాత్మక ధోరణిలో వ్యాఖ్యలు చేశారు. విజయసాయిరెడ్డిని శకుని మామతో పోల్చిన బుద్ధా, మీరు దోచుకున్న డబ్బుతో తీసిన 'మహామేత' సినిమా అట్టర్ ఫ్లాప్ అయిందని విమర్శించారు. మధ్యలోనే ఆగిన మీ 'జైలుయాత్ర' సినిమా త్వరలోనే పూర్తి కాబోతోందని, రెడీగా ఉండాలని వ్యంగ్యం ప్రదర్శించారు. ఈ విరామంలో '100 రోజుల తుగ్లక్ పాలన' అని మరో సినిమా ప్లాన్ చెయ్యి అంటూ సలహా ఇచ్చారు.

అంతేకాకుండా, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో బుద్ధా ఘాటుగా స్పందించారు. ప్రజలు మీకు, మీ తుగ్లక్ సీఎం జగన్ కు సినిమా చూపిస్తారని వైసీపీ శ్రేణులను హెచ్చరించారు. ఆ రోజులు దగ్గరపడ్డాయని ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేశారు. భారీ అంచనాలతో రిలీజైన మీ '151' సినిమాని ప్రజలు "థూ" అంటున్నారని ఎద్దేవా చేశారు. "ఆ టాక్ మీకు ఇంకా చేరలేదా వైసీపీ?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు.
Buddha Venkanna
Telugudesam
Andhra Pradesh
Vijay Sai Reddy
YSRCP
Jagan

More Telugu News