పెళ్లికి కట్టిన ప్లెక్సీ ఆమె పాలిట మృత్యువైంది!

  • తమిళనాడులోని పల్లావరంలో ఘటన
  • ప్లెక్సీ పడటంతో అదుపుతప్పిన బండి
  • వెనుకే వస్తున్న లారీ కింద నలిగిన శుభశ్రీ
ఓ వివాహం నిమిత్తం కట్టిన ప్లెక్సీ, గాలికి ఎగిరొచ్చి, ద్విచక్ర వాహనంపై వెళుతున్న యువతిపై పడగా, అదుపుతప్పిన ఆమె, వెనుక నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్ చక్రాల కింద పడి నలిగిపోయింది. ఈ ఘటన తమిళనాడు, పల్లావరం సమీపంలోని పళ్లికరణై సమీపంలో జరిగింది. శుభశ్రీ అనే యువతి టూ వీలర్ పై వెళుతుండగా, అన్నాడీఎంకే మాజీ కౌన్సిలర్, ఓ వివాహ అహ్వానం పేరిట నెలకొల్పిన ప్లెక్సీ, ఆమెపై పడింది.

దీంతో ఆమె బండి అదుపు తప్పగా, వెనుక నుంచి వస్తున్న వాటర్ ట్యాంకర్, ఆమె మీదుగా వెళ్లింది. దీంతో ఘటనా స్థలిలోనే ఆమె మరణించింది. విషయం తెలుసుకున్న పోలీసులు, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేశారు. ఆ ప్లెక్సీ ఎటువంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారని తేల్చారు. రాజకీయ నాయకులు ఇష్టానుసారంగా బ్యానర్లు, ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నా, పోలీసులు, ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు తీవ్ర విమర్శలు చేశారు.
Go Back to Shorts
Tamilnadu
Banner
Marriage
Flexi
Died
Lorry

More Telugu News