సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ రావడంలేదు... వివరణ ఇచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు కేటీఆర్ రావడంలేదు... వివరణ ఇచ్చిన కొణిదెల ప్రొడక్షన్స్

  • సైరా ఫంక్షన్ కు కేటీఆర్ వస్తారని సాయంకాలం ప్రకటన 
  • అధికారిక కార్యక్రమాలతో కేటీఆర్ బిజీ అని వెల్లడి
  • అక్టోబరు 2న రిలీజ్ అవుతున్న సైరా
మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా వస్తారని ఈ సాయంకాలం కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. అయితే, కాసేపటికే, ఈ కార్యక్రమానికి కేటీఆర్ రావడం లేదని సదరు చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ కు, ట్రైలర్ లాంచ్ చేసేందుకు కేటీఆర్ గారు రావడంలేదని, ఆయన అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ ట్వీట్ చేసింది.

కాగా, సైరా ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సొంత జిల్లా అయిన కర్నూలులో చేపట్టాలని మొదట నిర్ణయించినా, అక్కడికి ప్రముఖుల రాక, వారికి బస ఏర్పాట్లు చేయడం కష్టతరం కావడంతో హైదరాబాద్ లోనే నిర్వహించాలని చిత్రయూనిట్ నిర్ణయించింది. సైరా ప్రీరిలీజ్ పండుగ ఈ నెల 18న జరగనుంది.
Syeraa
Chiranjeevi
KTR

More Telugu News