నిజామాబాద్ బీజేపీ ఎంపీని కలిసిన బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్
- షకీల్ ఈరోజు నా నివాసానికి వచ్చారు
- తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించాం
- పలు విషయాలపై లోతుగా చర్చించాం: అరవింద్
ఈ సందర్భంగా అరవింద్ కు షకీల్ శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ ఫొటోను అరవింద్ పోస్ట్ చేశారు. కాగా, బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్. కొంత కాలంగా పార్టీ వ్యవహారాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అరవింద్ ను షకీల్ కలవడంపై ఆయన బీజేపీలోకి వెళ్తున్నారంటూ ప్రచారం ప్రారంభమైంది. టీఆర్ఎస్ నేతలకు షకీల్ ఫోన్ లో కూడా అందుబాటులో లేరని సమాచారం.