యువరాజ్ సింగ్ పై గృహహింస ఆరోపణలను వెనక్కి తీసుకున్న మరదలు!
- యువీ తమ్ముడు జొరావర్ ను పెళ్లాడిన ఆకాంక్ష
- పెళ్లయిన ఆర్నెల్లకే విభేదాలు
- ఇటీవలే విడాకులు మంజూరు
చట్టం నుంచి తప్పించుకోలేనని భావించి ఆకాంక్ష సింగ్ తాను చేసిన ఆరోపణలు తప్పు అని ఒప్పుకుందని తెలిపారు. యువీకి పేరుప్రతిష్ఠలు ఉండడంతో, వాటిని అడ్డంపెట్టుకుని తమ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. యువరాజ్ ను ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో భాగం చేశారని వివరించారు.
ఆకాంక్ష సింగ్ గతంలో బిగ్ బాస్ రియాల్టీ షోలో పాల్గొని గుర్తింపు తెచ్చుకుంది. యువీ తమ్ముడు జొరావర్ తో పెళ్లి ఆర్నెల్లలోపే పెటాకులైంది. అప్పట్లో ఆమె చేసిన ఆరోపణలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. యువీ గంజాయి తాగుతాడని, యువీతో పాటు ఇంట్లో అందరికీ ఆ అలవాటు ఉందని తెలిపింది. ఆఖరికి తాను కూడా భర్తతో కలిసి గంజాయి తాగాల్సి వచ్చిందని పేర్కొంది.