'మా' నుంచి నరేశ్ తప్పుకోవాల్సిందే... షోకాజ్ నోటీసులిచ్చిన హీరో రాజశేఖర్ వర్గం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'మా' నుంచి నరేశ్ తప్పుకోవాల్సిందే... షోకాజ్ నోటీసులిచ్చిన హీరో రాజశేఖర్ వర్గం!

  • 'మా' విభేదాలు తారస్థాయికి
  • నరేశ్, రాజశేఖర్ ల మధ్య దెబ్బతిన్న స్నేహం  
  • తప్పుకోవాల్సిందేనని డిమాండ్
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)లో విభేదాలు తారస్థాయికి చేరాయి. అధ్యక్షుడు నరేశ్, కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు రాజశేఖర్ ల మధ్య స్నేహం దెబ్బతినగా, రాజశేఖర్ వర్గం తీవ్రంగా స్పందించింది. నరేశ్ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలంటూ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. గత ఎన్నికల్లో 'మా' అధ్యక్షుడిగా నరేశ్ గెలుపొందగా, కార్యదర్శిగా జీవిత గెలిచిన సంగతి తెలిసిందే. తొలి రోజు నుంచే నరేశ్ వైఖరిపై రాజశేఖర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ప్రమాణ స్వీకారం చేసిన రోజునే  నరేశ్ 'నేను' అన్న పదం వాడుతూ మాట్లాడగా, రాజశేఖర్ నవ్వుతూనే విమర్శలు గుప్పిస్తూ, 'నేను కాదు... మేమంతా అనాలి' అంటూ చురకలేసిన సంగతి తెలిసిందే.
MAA
Naresh
Rajasekhar
Notice

More Telugu News