'సాహో'లో సాంగు మిస్సయిన కాజల్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'సాహో'లో సాంగు మిస్సయిన కాజల్!

  • తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ కి క్రేజ్ 
  • చేజారిన 'బ్యాడ్ బాయ్' సాంగ్
  • జాక్విలిన్ ఫెర్నాండేజ్ కి 2 కోట్లు  
తెలుగు .. తమిళ భాషల్లో కాజల్ కి మంచి క్రేజ్ వుంది. ఇక హిందీ ప్రేక్షకులకు కూడా ఆమె సుపరిచితమే. ఒక వైపున స్టార్ హీరోల జోడీ కడుతూనే, 'సీత' వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తోంది. అంతేకాదు తనకి నచ్చితే స్పెషల్ సాంగ్స్ లోను మెరుస్తోంది. 'పక్కా లోకల్' వంటి స్పెషల్ సాంగ్ తో ఆమె కుర్రకారులో హుషారెత్తించింది. అలాంటి కాజల్ కి 'సాహో' నుంచి అవకాశం వెళ్లిందనే ఒక వార్త ఆలస్యంగా బయటికి వచ్చింది.

'సాహో' సినిమాలో 'బ్యాడ్ బాయ్' సాంగ్ చాలా పాప్యులర్ అయింది. ఈ సాంగ్ కోసం ముందుగా కాజల్ ను సంప్రదించారట. ప్రభాస్ తో గల సాన్నిహిత్యం కారణంగా, ఈ ప్రాజెక్టుకు గల క్రేజ్ కారణంగా వెంటనే కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ ఆ తరువాత ఈ సినిమా టీమ్ మనసు మార్చుకుని జాక్విలిన్ ఫెర్నాండేజ్ ను తీసుకున్నారు. ఈ పాటలో చేసినందుకు పారితోషికంగా ఆమె 2 కోట్లు తీసుకున్నట్టుగా చెప్పుకుంటున్నారు.
Kajal Agarwal

More Telugu News