చంద్రబాబు హౌస్ అరెస్టుపై వివరణ ఇచ్చిన ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్!
- నేడు ఛలో ఆత్మకూరుకు టీడీపీ పిలుపు
- చంద్రబాబు ఇల్లు దాటకుండా పోలీసుల అడ్డగింత
- ఎందుకు అడ్డుకున్నామో చెప్పిన డీజీపీ
ప్రభుత్వ విధానాలపై పోరాటం చేస్తున్నందుకు చంద్రబాబును తాము హౌస్ అరెస్ట్ చేయలేదని సవాంగ్ స్పష్టం చేశారు. చంద్రబాబు పల్నాడుకు వెళితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశముందని తెలిపారు. అందుకే టీడీపీ అధినేతను ముందస్తుగా నిర్బంధంలోకి తీసుకున్నామని పేర్కొన్నారు.