పాఠశాల ప్రాంగణంలోనే రొమాన్స్.. టీచర్ ను చితకబాదిన గ్రామస్తులు!
- తమిళనాడులో నామక్కల్ జిల్లాలో ఘటన
- అంగన్వాడీ ఉద్యోగితో టీచర్ వివాహేతర సంబంధం
- స్కూలు ప్రాంగణంలోనే కామక్రీడ
జిల్లాలోని బుధన్సంత సమీపంలో వున్న ఉడుపత్తి పంచాయతీ ప్రాథమిక పాఠశాలలో శరవణన్ టీచర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు అదే పాఠశాల ప్రాంగణంలో అంగన్ వాడీ కేంద్రం ఆర్గనైజర్ గా పనిచేస్తున్న జయంతికి వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరు పాఠశాల ప్రాంగణంలోనే కామక్రీడలో మునిగిపోయారు.
ఈ నిర్వాకాన్ని చూసిన పిల్లలు తమ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో కోపంతో ఊగిపోయిన గ్రామస్తులు టీచర్ శరవణన్ ను పట్టుకుని చితక్కొట్టారు. అనంతరం స్కూలు హెడ్ మాస్టర్ కు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారం జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో త్వరలోనే విచారణ ప్రారంభం కానున్నట్లు సమాచారం.