Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మలేరియా కేసుల నమోదులో భారత్‌కు నాలుగో స్థానం

  • భారత్ కంటే ముందు నైజీరియా, కాంగో, మొజాంబిక్ దేశాలు
  • 2017లో ప్రపంచవ్యాప్తంగా 21.90 కోట్ల కేసులు నమోదు
  • ఒక్క భారత్‌లోనే కోటికి పైగా కేసులు
మలేరియా కేసుల నమోదులో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2017లో ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో 4 శాతం భారత్‌లోనే నమోదయ్యాయని లాన్సెజ్ జనరల్ నివేదిక వెల్లడించింది. ఆ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 21.90 కోట్ల కేసులు నమోదు కాగా, ఒక్క భారత్‌లోనే కోటికిపైగా కేసులు నమోదైనట్టు పేర్కొంది. ఆఫ్రికా దేశాలైన నైజీరియా, కాంగో, మొజాంబిక్‌లు వరుసగా భారత్‌ కంటే ముందున్నాయి. ఈ నివేదికపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ మాట్లాడుతూ మలేరియాను దేశం నుంచి తరిమికొట్టడమే తమ లక్ష్యమన్నారు. అలాగే, టీబీ, మెదడువాపు వ్యాధి, కాలా జ్వరం వంటి వాటిని కూడా నివారించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.
Malaria
world
India
mosquito

More Telugu News