ప్రొద్దుటూరులో యువకుడిపై వైసీపీ నాయకుడి దాడి!
- ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
- అనుచరులతో కలిసి యువకుడిపై శివారెడ్డి దాడి
- బాధితుడు వడ్ల నరేశ్ ఆరోపణ
ఈ ఘటనలో గాయపడ్డ నరేశ్, మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఎదుట బాధితుడు నరేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. శివారెడ్డితో కలిసి తాను తిరగలేదన్న కోపంతో తనపై దాడి చేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దీనిపై ప్రసాదరెడ్డి స్పందిస్తూ, దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని నరేశ్ కు హామీ ఇచ్చినట్టు సమాచారం.