ప్రొద్దుటూరులో యువకుడిపై వైసీపీ నాయకుడి దాడి!

  • ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
  • అనుచరులతో కలిసి యువకుడిపై శివారెడ్డి దాడి
  • బాధితుడు వడ్ల నరేశ్ ఆరోపణ
కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ యువకుడిపై వైసీపీ నాయకుడు దాడికి పాల్పడ్డ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఈ దాడి ఘటనకు సంబంధించిన వివరాలు.. వైసీపీ నాయకుడు శివారెడ్డి తన అనుచరులతో కలిసి యువకుడు వడ్ల నరేశ్ పై దాడి చేశాడు.

ఈ ఘటనలో గాయపడ్డ నరేశ్, మూడు రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తనను పరామర్శించేందుకు ఆసుపత్రికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే ప్రసాద్ రెడ్డి ఎదుట బాధితుడు నరేశ్ కన్నీటి పర్యంతమయ్యాడు. శివారెడ్డితో కలిసి తాను తిరగలేదన్న కోపంతో తనపై దాడి చేశారని, ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని ఆరోపించారు. దీనిపై ప్రసాదరెడ్డి స్పందిస్తూ, దాడికి కారకులైన వారిపై చర్యలు తీసుకుంటామని నరేశ్ కు హామీ ఇచ్చినట్టు సమాచారం.
Go Back to Shorts
cuddapah
produtur
YSRCP
youth
Attack

More Telugu News