గవర్నర్ తమిళి సై గురించి తప్పుడు రాతలు రాయించిన కేసీఆర్: బీజేపీ నేత మండిపాటు
- ప్రమాణ స్వీకారం చేసి రోజైనా గడవకముందే తప్పుడు రాతలు
- గవర్నర్ పై విషం కక్కేలా వార్తలా?
- నిప్పులు చెరిగిన ఇంద్రసేనారెడ్డి
ప్రభుత్వ వేతనం తీసుకుంటూ, రాజ్యాంగ బద్ధమైన పదవిని అవమానించేలా ఆయన ప్రవర్తించారని అన్నారు. గవర్నర్ ను కించపరిచేలా వ్యాసం రాసి, దాని చివరన 'ఇది నా సొంత అభిప్రాయం' అని రాయించారని అన్న ఇంద్రసేనా రెడ్డి, గవర్నర్ పదవిని వారు అవమానించారని అన్నారు. అనుచిత వ్యాఖ్యలు చేయించినందుకు కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్ ఎన్నికల తరువాత టీఆర్ఎస్ పై నమ్మకాన్ని కోల్పోయిన ప్రజలు, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ లో అసమ్మతి బయటకు వస్తోందని, మొన్న ఈటల, నిన్న రసమయి, నాయిని, జోగురామన్నలు తమ బాధను బయట పెట్టారని అన్నారు.