అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ పూర్తిచేసిన సుకుమార్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అల్లు అర్జున్ కోసం స్క్రిప్ట్ పూర్తిచేసిన సుకుమార్

  • త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ తాజా చిత్రం 
  • తదుపరి సినిమా సుకుమార్ తో 
  • ప్రేమ నేపథ్యంలో సాగే కథ
అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో 'అల .. వైకుంఠపురములో' సినిమా చేస్తున్నాడు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ సినిమా తరువాత సుకుమార్ తో కలిసి అల్లు అర్జున్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ ఒక కథను సిద్ధం చేశాడు. ఈ కథలో కొన్ని మార్పులు చేసిన అనంతరం అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అయితే ఆ తరువాత మనసు మార్చుకున్నట్టు సమాచారం. గతంలో తమ కాంబినేషన్లో 'ఆర్య'.. 'ఆర్య 2' వంటి ప్రేమకథా చిత్రాలే వచ్చాయి గనుక, ఆ తరహా సినిమానే చేద్దామని అల్లు అర్జున్ చెప్పాడట. దాంతో సుకుమార్ అల్లు అర్జున్ కోసం మరో లైన్ ను వినిపించడం .. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట. తాజాగా స్క్రిప్ట్ వర్కును పూర్తిచేసిన సుకుమార్, మిగతా విషయాలపై దృష్టిపెట్టాడని అంటున్నారు.
Allu Arjun
Sukumar

More Telugu News